KDP: వేంపల్లె పాతపేటలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానికంగా తొలిసారిగా 700 టెంకాయలతో 9 అడుగుల భారీ వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. అర్చకులు వేదమంత్రాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలతో విభిన్నంగా రూపొందించిన వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాడు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
700 టెంకాయలతో భారీ గణనాథుడు!


