హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అవనిగడ్డలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

కృష్ణా: వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు అవనిగడ్డలో మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. కొల్లిపర బదరి వెంకటనారాయణ మెమోరియల్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో కొల్లిపర రాధాకృష్ణ దంపతులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు.