MDK: తీవ్ర కడుపునొప్పి తాళలేక ఓ యువతి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం ఫరీద్‌పూర్‌లో జరిగింది. ఎస్ఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిత్ర (22) శుక్రవారం రాత్రి ఇల్లు వదిలి వెళ్లి, చెరువులో శవమై తేలింది. ఆదివారం మృతదేహాన్ని గుర్తించిన తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
కడుపునొప్పి తాళలేక యువతి ఆత్మహత్య


