హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి: ఎమ్మెల్యే

KDP: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సోమవారం స్వగ్రామం కామనూరులో గణేశ్ పూజలో పాల్గొన్నారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగను ప్రజలంతా సుఖసంతోషాలతో చేసుకోవాలని సూచించారు. ప్రమాదాలకు దూరంగా, ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు.