హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జలపాతాలకు పోటెత్తిన పర్యాటకులు

ASR: అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు సీతంపేట ఏజెన్సీ, భామిని మండలంలోని జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. పర్యాటకులు పెద్దఎత్తున తరలివచ్చారు. జలధారల అందాలను ఆస్వాదిస్తూ స్నానాలు చేశారు. ఫొటోషూట్‌ పాయింట్ల వద్ద సెల్ఫీలు దిగారు. ఆడలి వ్యూ పాయింట్‌, ఎన్‌టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌లోనూ సందడి నెలకొంది.