హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరు నెలల గర్భవతిని గొంతునులిమి చంపేసిన భర్త

HYD: అల్వాల్‌ పీఎస్ పరిధి సూర్యనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆరు నెలల గర్భవతిగా ఉన్న భార్యను భర్త అతికిరతకంగా హత్య చేశాడు. పరశురామ్, శివానీకి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. భార్య శివానీ ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి కాగా ఆమెపై పరశురామ్ అనుమానం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే శివానీని గొంతు నులిమి హతమార్చినట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.