PPM: సీతానగరం వెలమవారి వీధిలో భారీ వినాయక స్వామి కొలువుదీరారు. కమిటీ సభ్యులు క్రేన్ సహాయంతో తీసుకువచ్చి మండపంలో సోమవారం ఉదయం ఉంచారు. విష్ణుమూర్తి వలే సర్పాలపై సేద తీరుతున్న రూపంలో గణపతిని రూపొందించారు. మండపం అందంగా అలంకరణ చేపట్టి నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా జరపడానికి కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
శేష పాన్పుపై బొజ్జ గణపయ్య


