హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శివనామ స్మరణతో నిండిన ఆలయం

NTR: పెనుగంచిప్రోలు మండలంలోని శివాలయాలు భాద్రపదమాసం, వినాయక చవితి సందర్భంగా శివనామ స్మరణతో మార్మోగాయి. తోటచర్లలోని గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో వేద పండితులు, పూజారి సురేపల్లి సంగమేశ్వర శర్మ ఆధ్వర్యంలో శివలింగానికి మహా రుద్రాభిషేకం, అష్టోత్తరాలు నిర్వహించారు. భక్తులు నాగదేవతలకు పాలాభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు.