ADB: బజార్హత్నూర్ మండలం గిర్నూర్‌లోని ఎస్సీ కాలనీలలో రోడ్డు బురదమయంగా మారడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారి పూర్తిగా బురదమయంగా మారింది. దీంతో ఆ కాలనీకి వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి మట్టి రోడ్డు, లేదా సీసీ రోడ్డును వేయాలని స్థానిక ప్రజలు కోరారు.
తెలంగాణ
బురదమయంగా మారిన రోడ్డు


