హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొక్కలతో సస్య గణపతి..

అనకాపల్లి చింతామణి గణపతి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా మొక్కలతో రూపొందించిన సస్య గణపతిని ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభం, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో సస్య గణపతిని ఏర్పాటు చేశామన్నారు.