హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నాలాల ప్రక్షాళన లేకే వరద ముంపు

HNK: కమలాపూర్ మండల కేంద్రంలోని 11వ వార్డులో సోమవారం భారీ వర్షానికి సబితా స్టూడియో పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎగువ నుంచి వరద నీరు పెద్దఎత్తున రావడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలాల ప్రక్షాళన లేకపోవడంతో ప్రతి ఏటా ఇళ్లలోకి వరద నీరు చేరుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.