హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రావులపాలెం మండలంలో భారీ వర్షం

కోనసీమ: రావులపాలెం మండల వ్యాప్తంగా సోమవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి ఆకాశం మేఘావృతమై జోరుగా వర్షం పడింది. దీంతో మండలంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు చిత్తడిగా మారి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వినాయక చవితి ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో వర్షం కారణంగా వినాయక మండపాల వద్ద భక్తులకు కొంత ఇబ్బంది ఏర్పడింది.