హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అండర్ బ్రిడ్జి కింద వరద.. రాకపోకలకు అంతరాయం

వరంగల్ నగరంలో సోమవారం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే అండర్ బ్రిడ్జి, హంటర్ రోడ్డు చిన్న బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీటిలో గుంతలు కనిపించక పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.