KRNL: తుంగభద్ర జలాశయానికి నాలుగు రోజుల నుంచి వరద ప్రవాహం నిలిచిపోయిందని టీబీ డ్యాం బోర్డు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఎలాంటి ఇన్ ఫ్లో రాలేదని పేర్కొన్నారు. తాగు, సాగు అవసరాలకు, నదికి కలిపి 11,117 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. జలాశయంలో ప్రస్తుతం 86.88 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
తుంగభద్రకు నిలిచిపోయిన ఇన్ ఫ్లో


