హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చవితి ఐకమత్యానికి ప్రతీక వినాయక: తులసిరెడ్డి

KDP: వినాయక చవితి ప్రజల్లో ఐకమత్యం, భక్తిభావాన్ని పెంపొందించే పండుగ అని కాంగ్రెస్ నేత డా. తులసిరెడ్డి అన్నారు. సోమవారం వేంపల్లె శివాలయం వీధిలో ఏర్పాటు చేసిన వినాయక స్వామి పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భాద్రపద మాసం శుక్ల చతుర్థి నాడు హిందువులు వినాయక చవితి పండుగ జరుపుకుంటారన్నారు. వినాయక చవితి జాతీయ సమైక్యతకు చిహ్నంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.