హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విఘ్నేశ్వరుడికి వినతిపత్రం..

VZM: కొమరాడ మండలంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుడికి వినతిపత్రం సమర్పించారు. సోమవారం కొమరాడ మండల కేంద్రంలోని మరడాన వీధిలో పూజలు అందుకుంటున్న వినాయకుడికి రైతులతో కలిసి సీపీఎం మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి వినతిపత్రం అందజేశారు.