వికారాబాద్ (M) గంగారం నుంచి నాగారం వెళ్లే ప్రధాన రహదారి పనులు ప్రజలకు శాపంగా మారాయి. రోడ్డు పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ ఎర్రమట్టికి బదులు నల్లమట్టి వేయడంతో రోడ్డు పూర్తిగా దిగబడిపోయి పెద్ద పెద్ద గుంతలుగా ఏర్పడి బురదమయంగా మారింది. స్వల్ప వర్షానికే ఈ రోడ్డు నడవడానికి కూడా వీలులేకుండా తయారైంది. పాదచారులు నడవడానికే ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు వేయాలని కోరారు.
తెలంగాణ
అధ్వానంగా మారిన గంగారం- నాగారం రోడ్డు


