నారాయణపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సామాజిక కార్యకర్త నరసింహ డిమాండ్ చేశారు. సోమవారం ఉట్కూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు జిల్లాలో సరైన వర్షాలు పడక పత్తి, ఆముదం, కంది విత్తనాలు ఒకటికి రెండుసార్లు నాటి అవి మొలకెత్తక తీవ్రంగా నష్టపోయారని ఆవేదనను వ్యక్తం చేశారు.
తెలంగాణ
'జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి'


