BDK: భద్రాచలంలో సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో సోమవారం నిత్యకళ్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి నిత్యకళ్యాణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించి సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండువగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
తెలంగాణ
ఘనంగా సీతారామచంద్ర స్వామి నిత్యకళ్యాణం


