హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా వినాయక చవితి వేడుకలు

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం పోపూరు గ్రామంలో రామాలయం వద్ద, వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడి ఆశీస్సులు పొందారు.