హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీజేలకు అనుమతి లేదు :ఎస్సై

MLG: గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎస్సై చల్ల రాజు కోరారు. ఈరోజు మండలంలోని ఉత్సవ కమిటీలతో సమావేశం నిర్వహించారు. మండపాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, అనుమతులు పొందాలని సూచించారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని, డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.