WGL: దుగ్గొండి మండల వ్యాప్తంగా నేడు ఉదయం 10 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత వర్షం పడటంతో పత్తి, మిర్చి పంటలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
VIDEO: దుగ్గొండి మండలంలో భారీ వర్షం.


