హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలుడిపై పిచ్చికుక్క దాడి.. తీవ్రగాయాలు

ASF: బెజ్జుర్ మండలం మోగవెల్లిలో ఇంటి సమీపంలో ఆడుకుంటున్న అలం గౌతమ్ అనే బాలుడిపై ఇవాళ పిచ్చికుక్క దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి కాలుపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పిచ్చికుక్కల బెడదను నివారించేందుకు చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ అధికారులను స్థానికులు కోరుతున్నారు.