హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీ వర్షాలు.. సింగరేణికి రూ.3 కోట్ల నష్టం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరపి వర్షాలతో సింగరేణి భూపాలపల్లి డివిజన్‌లోని కాకతీయ ఓపెన్‌కాస్ట్–2, 3 గనుల్లోకి వరద నీరు చేరింది. దీంతో వరుసగా మూడో సోమవారం రోజు 24 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ ఘటనతో సింగరేణి సంస్థకు సుమారు రూ.3 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.