హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్య కార్మికురాలికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: మదనపల్లె పట్టణం కుమారపురంలో ఉదయాన్నే రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గాంధీపురానికి చెందిన వెంకటరమణ భార్య గంగులమ్మ (55) మున్సిపాల్టీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఉదయాన్నే డ్యూటీకి వెళ్లారు. విధులు ముగించుకుని ఇంటికి వస్తుండగా బైక్ ఢీకొట్టిందన్నారు. గాయపడిన ఆమెను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.