ASF: సిర్పూర్ (టి) మండలం పారిగాం సమీపంలో సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకుంది. ఏళ్లుగా మరమ్మతులు చేపట్టకపోవడంతో వంతెన బలహీనంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రాకపోకలు సాగించే ప్రజలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. అధికారులు వెంటనే వంతెనను పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టి ప్రమాదాన్ని నివారించాలన్నారు.
తెలంగాణ
VIDEO: శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన పారిగాం వంతెన


