హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంటల నమోదు.. రైతులకు మేలు

ASF: వానాకాలం సీజన్‌కు సంబంధించి మండలంలోని అన్ని గ్రామాల్లో డిజిటల్ క్రాప్ సర్వే కొనసాగుతోందని, రైతులు సర్వే బృందాలకు సహకరించాలని వ్యవసాయాధికారి గోపికాంత్ కోరారు. ఎంఈవోల పర్యవేక్షణలో నియమితులైన వాలంటీర్లు ప్రతి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి వివరాలు సేకరిస్తు న్నారన్నారు. రైతులు తమ చేనులో సాగు చేసిన పంట వివరాలు, విస్తీర్ణం, సర్వేనంబర్ల గుర్తింపులో తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు.