హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. రైతు మృతి

కోనసీమ: మామిడికుదురు 216 జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై సోమవారం జరిగిన ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన రైతు బాలం శ్రీనివాసరావు (55) మృతి చెందాడు. గుర్తుతెలియని లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. జడ్పీహెచ్ స్కూల్ రోడ్డు చర్చి-ఎన్‌హెచ్ జంక్షన్ వద్ద ఘటన చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.