హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆదాయం వివరాలు

కృష్ణా: మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి ఆదివారం ఒక్కరోజులో వివిధ సేవల టిక్కెట్ల రుసుము ద్వారా రూ. 6,82,885 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు.