హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ సంగారెడ్డి ఇన్‌ఛార్జ్‌గా సంగప్ప

​సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా సంగప్ప నియమితులయ్యారు. గ్రామీణ స్థాయిలో పార్టీని మరింత శక్తివంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తెలిపారు. అధిష్టానం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, నియోజకవర్గంలో పార్టీ విజయానికి శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా సంగప్ప స్పష్టం చేశారు.