NTR: విజయవాడలో వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాలు, పారిశుద్ధ్యం, డ్రెయినేజీ పరిస్థితిపై సమీక్షించారు. నగరంలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాన డ్రెయిన్లు, అవుట్‌ఫాల్ డ్రెయిన్లలో డీసిల్టింగ్ పనులను నిరంతరం కొనసాగించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్షాల నేపథ్యంలో కమిషనర్ హెచ్చరికలు


