హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతలతో వాహనదారుల అవస్థలు

NTR: జగ్గయ్యపేట మండలం పోచంపల్లి గ్రామ శివారులోని రహదారులు గుంతలమయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో గుంతలు కనిపించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.