BHNG: యాదాద్రి జిల్లాలోని చెరువుగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామివారిని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి, వేదాశీర్వచనం అందించారు.
తెలంగాణ
చెరువు గట్టులో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు


