AKP: ఎల్‌నినో ప్రభావం వినాయక ఉత్సవాలపై పడింది. సోమవారం నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో నేటి సాయంత్రం నుంచి తొమ్మిది రోజులు పాటు రోజు వరుసగా విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేస్తారు. వర్షభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కోటవురట్ల మండలంలో పలు గ్రామాల మీదుగా ప్రవహించే వరాహ నది ఎండిపోయింది. చెరువులు, కాలువల్లోనూ నీరు లేకపోవడంతో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
నిమజ్జనానికి నీటి కొరత


