హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాతపట్నం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

SKLM: పాతపట్నంలో శ్రీ నీలమణి దుర్గ అమ్మవారికి సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. వినాయక చవితిని పురస్కరించుకుని అమ్మవారికి పంచామృత అభిషేకాలు, కుంకుమార్చనలు, ప్రత్యేక అలంకరణలు చేశారు. భక్తులకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి కటాక్షం కోసం మహిళలు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.