NZB: నవీపేట్‌లోని అభంగపట్నం శివాలయ ప్రాంగణంలో అద్భుత దృశ్యం భక్తులను ఆకట్టుకుంటోంది. ఆలయ పునర్నిర్మాణానికి ముందు పరిసరాలను పరిశీలించిన గ్రామ పెద్దలకు 3 చెట్లు కలిసి పెరిగిన చోట గణపతి ముఖాకారం కనిపించింది. దీంతో గ్రామస్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. పునర్నిర్మాణానికి ముందే విఘ్నేశ్వరుడి దర్శనం కావడం శుభసూచకమని సర్పంచ్ గైని వసంత సతీష్ సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ
శివాలయ ప్రాంగణంలో గణపతి ఆకారం


