హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లాకు రానున్న మంత్రి సీతక్క

NZB: బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల కోసం రేపు పంచాయతీరాజ్ మంత్రి సీతక్క పర్యటించనున్నట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సునీల్ రెడ్డి తెలిపారు. పాలెం, నాగపూర్‌లో గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించనున్నారని, మోర్తాడ్‌లో ప్రజా సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాలకు ప్రజలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.