హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ షాక్ గురై హోంగార్డు మృతి

నెల్లూరు: వినాయక చవితి వేళ ఆత్మకూరులో విషాదం చోటుచేసుకుంది. పోలీస్ క్వార్టర్స్‌లో వినాయక మండపానికి విద్యుత్ సరఫరా ఏర్పాటు చేస్తుండగా హోంగార్డు మల్లం ప్రసాద్ (40) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. ప్రసాద్ మృతిపై డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ గంగాధర్, ఎస్‌ఐ జంపానీ కుమార్ సంతాపం తెలిపారు. దీంతో ఇతని స్వగ్రామం కృష్ణాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.