హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

NRPT: అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. మక్తల్ మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన కురుమప్ప, అంజప్ప ఆదివారం పెద్దవాగు నుంచి కర్నూలుకు ఇసుక తరలిస్తుండగా గ్రామ శివారులో పోలీసులు పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.