హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLA క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు

MNCL: బెల్లంపల్లి MLA క్యాంపు కార్యాలయంలో సోమవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్వయంగా వినాయకుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడిపంటలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని దేవుని ప్రార్థించారు. ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో విఘ్నాలని తొలగాలని కోరారు.