హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వినాయకుని ప్రతిష్టాపనకు కొనసాగుతున్న ఏర్పాట్లు

ADB: తాంసి మండలంలో వినాయకుని ప్రతిష్టాపనకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన శ్రీ గణేష్ యూత్ కమిటీ సభ్యులు HIT TV తో ముచ్చటించారు. సభ్యుడు మహేందర్ మాట్లాడుతూ.. గత 26 సంవత్సరాలుగా గ్రామంలో వినాయకుని ప్రతిష్టిస్తున్నామని పేర్కొన్నారు. రూ. 5 వందలతో ప్రారంభమై ఇప్పుడు 70 వేల ఖర్చు అవుతుందని నిర్వాహకులు తెలిపారు.