హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మల్లన్నను దర్శించుకున్న గళ్ళా దంపతులు

GNTR: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి దంపతులు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 450 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలే తన కుటుంబమని తెలిపారు.