హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్

GDWL: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు పరవాస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఉచిత భోజనం, వసతితో శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే 300 మందికి శిక్షణ ప్రారంభించిన సంస్థ.. మరో 400 మందిని ఎంపిక చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సెప్టెంబరు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 20న అర్హత పరీక్ష, 22న ఫలితాలు విడుదల చేయనున్నారు.