హైదరాబాద్: 28°C
తెలంగాణ

విఘ్నాలన్నీ తొలగాలి: ఎమ్మెల్యే

BHPL: వినాయక చవితి సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని, విఘ్నాలు తొలగి ప్రతి ఇంటా సుఖసంతోషాలు, సుభిక్షం కలగాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించాలని సూచించారు. ఎలాంటి అవాంఛానీయ సంఘటనలకు తావులేకుండా ఉత్సవాలను జరుపుకోవాలని పేర్కొన్నారు.