హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ACP

KMM: గణేష్‌ ఉత్సవాలను ప్రశాంతంగా, ఆనందంగా నిర్వహించుకోవాలని వైరా ఏసీపీ సారంగపాణి సూచించారు. కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలన్నారు. మండపాల నమోదు, జియోట్యాగింగ్‌ తప్పనిసరని తెలిపారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు, విద్యుత్, అగ్నిమాపక భద్రత చర్యలు చేపట్టాలన్నారు. పోలీసుల రూట్‌మ్యాప్‌ ప్రకారం శోభాయాత్ర నిర్వహించాలని సూచించారు.