హైదరాబాద్: 28°C
తెలంగాణ

రంగనాయక ఆలయానికి రూ.5.26 లక్షల ఆదాయం

MBNR: బాదేపల్లి శ్రీరంగనాయక స్వామి ఆలయంలో శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. నెలరోజుల పాటు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. హుండీ ద్వారా రూ.2,83,480, లడ్డూ, ప్రసాదాల విక్రయాలతో రూ.92 వేలు, కొబ్బరికాయల ద్వారా రూ.1.51 లక్షలు కలిపి మొత్తం రూ.5,26,480 ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ కాల్వ రామిరెడ్డి తెలిపారు.