సత్యసాయి: జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో విరసిల్లాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్


