హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ముందు కార్పొరేటర్‌గా గెలువు: కొండా

WGL: MLC బసవరాజు సారయ్య, MLA నాయిని రాజేందర్ లపై కొండా సురేఖ పరోక్షంగా సెటైర్లు వేశారు. 'సారయ్య నా మీద పోటీ చేసి MLAగా గెలుస్తా అంటున్నాడు. ముందు మా అనుచరుల మీద కార్పొరేటర్‌గా గెలువు' అని సవాల్ విసిరారు. నాయిని రాజేందర్ ఆనాడు వినయ్ భాస్కర్‌ను తట్టుకోలేక నియోజకవర్గంలోని కార్యక్రమాలకు మమ్మల్ని బతిమాలి తీసుకెళ్లేవాడు అని కౌంటర్ ఇచ్చారు.