PPM: కురుపాం మండలం బియ్యాలవలస మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో గేటు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఐదేళ్ల క్రితం నిర్మించిన ప్రహరీకి ఇప్పటివరకు గేటు ఏర్పాటు చేయలేదు. దీంతో పశువులు పాఠశాల ఆవరణలోకి వస్తుండటంతో ఉపాధ్యాయులు వెదురు కర్రలతో తాత్కాలిక గేటు ఏర్పాటు చేసుకున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రహరీ ఉంది.. గేటు లేదు!


