NRML: జిల్లాలో మధుమేహం, BP బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఎన్సీడీ సర్వేలో భాగంగా ఇప్పటివరకు 2,58,399 మందికి పరీక్షలు నిర్వహించగా, 34,163 మందికి బీపీ, 21,208 మందికి మధుమేహం ఉన్నట్లు తేలింది. మారిన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, జంక్‌ఫుడ్ అలవాట్లు ప్రధాన కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. ప్రజలు క్రమం తప్పకుండా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
తెలంగాణ
చిన్న వయసులోనే బీపీ, షుగర్


